Home / SLIDER / అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర

అభివృద్ధిలో హెచ్ఎండిఏ గణనీయమైన పాత్ర

జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ (హెచ్.జి.సి.ఎల్)లలో ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండిఏ ఆవరణలో హెచ్ఎండిఎస్ సెక్రెటరీ పి.చంద్రయ్య హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఆవరణలో చీఫ్ జనరల్ మేనేజర్ రవీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఎగురవేశారు.

ఈ సందర్భంగా హెచ్ఎండిఎ సెక్రెటరీ పి.చంద్రయ్య, ఓఎస్డీ ఎం. రాంకిషన్ ఉద్యోగులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతు జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల ప్రాధాన్యతను వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి జాతీయ సమైక్యతను చాటిచెబుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం అవతరించిన తదుపరి ప్రభుత్వం అన్నిరంగాల్లో అభివృద్ధిని చేసిచూపిందన్నారు.ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.టి రామారావు ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్ కుమార్ పర్యవేక్షణలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్ఎండిఏ ఎంతో కీలకంగా భాగస్వామ్యం కావడం సంతోషకరమని వారు తెలిపారు.

కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, ల్యాండ్ పూలింగ్ ఆఫీసర్ ప్రసూనాంబ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, ఎన్ ఫోర్స్ మెంట్ డిఎస్పీ సత్తయ్య, సర్కిల్ ఇన్స్ పెక్టర్ వెంకటేష్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ లతోపాటు అర్బన్ ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat