అంతా అనుకున్నట్లే జరిగింది..ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో రహస్య సంబంధం కొనసాగించిన చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా
తన అసలు ముసుగు తీసేసాడు. రూ. 371 కోట్లు అవినీతి అనేది చాలా చిన్న విషయమంటూ నిస్సిగ్గుగా చంద్రబాబును సమర్థించిన పవన్..ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని, రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని ప్రకటించాడు..అసలు పార్టీలో పొత్తుపై సంబంధం లేకుండా..ఇన్నాళ్లు కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న టీడీపీ నాయకుల దాడులను, అవమానాలను ఎదుర్కొంటూ పవన్ కల్యాణ్‌ని సీఎంగా చేయాలన్న జనసైనికులు పవన్ పొత్తు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపుల దైవం రంగాను చంపిన, కులపెద్ద ముద్రగడ పద్మనాభంను, ఆయన భార్యా, కొడుకు, కోడలు బట్టలు చింపి , ఖాకీలతో కొట్టించిన అవమానించిన చంద్రబాబు కాళ్ల దగ్గర కాపుజాతిని తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్ పై కాపులు మండిపడుతున్నారు..
నాలుగేళ్లలోనే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై.. సంక్షేమ పాలన అందిస్తూ..తిరుగులేని శక్తిగా ఎదిగిన జగన్‌ను ఓడించాలంటే…టీడీపీతో కలిసి పోటీ చేయకతప్పదని పవన్ తన చేతకానితనాన్ని చాటుకున్నాడు..
టీడీపీ, జనసేన అవకాశవాద, అనైతిక పొత్తులపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘తోడేళ్ల ముఠాతో సింహం తలపడుతోంది. వచ్చే ఎన్నికలు దురాశ, ప్రజాసంక్షేమం మధ్య ఉండబోతున్నాయి. కుల రాజకీయాలు, ఐక్యత మధ్యే ఎన్నికలు జరగబోతున్నాయి. అవకాశవాదం, నిజాయితీ మధ్య ఎన్నికలు జరుగుతాయి’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని ఎప్పుడో చెప్పాం. ఆ మాటలు దత్తపుత్రుడు నిజం చేశాడు. టీడీపీతో పొత్తును జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ, జనసేన బంగాళాఖాతంలో కలవడం ఖాయం అంటూ కామెంట్స్ చేశారు. మొత్తంగా రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు లక్షలాది మంది అభిమానుల ఆశలను కూల్చేస్తూ..జనసైనికుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కేవలం ప్యాకేజీ కోసం…తన పార్టీని, కాపుల ఆత్మగౌరవాన్ని కమ్మ కుల దైవం చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్ తన స్థాయిని తానే దిగజార్చుకున్నాడు..
ఇక నిన్న చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్‌ని ఒంటరిగా పోటీ చేసి ఓడించలేం కాబట్టి బీజేపీ వచ్చినా రాకున్నా… టీడీపీ, జనసేన లు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతాయని బాలయ్య, లోకేష్ సాక్షిగా పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. .నాన్నా పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తోంది..అంటూ శివాజీ సినిమాలో రజనీకాంత్ కొట్టిన డైలాగ్ …చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ , గుంపులుగా వస్తే..జగన్ సింహంలా సింగిల్‌గా వస్తాడంటై..వైఎస్ఆర్‌సీపీ అభిమానులు మీమ్స్, సెటైరికల్ వీడియోలతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు.