జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది చపల మనస్తత్వం..వ్యక్తిగత జీవితంలోనే కాదు..రాజకీయాల్లో కూడా పవన్ తన చపలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు..మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ తన సహనటి రేణూదేశాయ్‌లో కొన్నాళ్లు సహజీవనం చేసి బిడ్డను కూడా కన్నాడు..అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ సహజీవనంపై విమర్శలు రావడంతో పక్కన కొడుకుని పెట్టుకుని రేణూదేశాయ్‌ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి మరో బిడ్డను కన్నాడు..రేణూతో సెట్ అయ్యాడని అభిమానులంతా అనుకున్న టైమ్‌లో ఆమెతో కాపురం చేస్తూనే..తీన్మార్ షూటింగ్‌లో పరిచయమైన పోలెండ్ బ్యూటీ అన్నాలెజెనోవాతో అక్రమ సంబంధం పెట్టుకుని…ఓ బిడ్డను కన్నాడు..రేణూదేశాయ్ ఈ విషయమై గొడవ చేయడంతో ఆమెకు విడాకులు ఇచ్చి..అన్నా లెజెనోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు… ఇప్పుడు సేమ్ టు సేమ్ తన కక్కుర్తిని రాజకీయాల్లోకి కూడా ఫాలో అవుతున్నాడు..మొదట టీడీపీ, బీజేపీతో కాపురం…ఆ తర్వాత బీజేపీని వదిలేసి…టీడీపీని సేవ్ చేయడం కోసం… కమ్యూనిస్టులతో కలిసి కాపురం..ఎన్నికలు కాగానే..మళ్లీ చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు ..మళ్లీ మోదీతో కాపురం…ఇప్పుడు చంద్రబాబుకు ఆపద వచ్చిందనే సాకుతో బీజేపీకి చెప్పా పెట్టాకుండా.. తన జనసేన కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా..మళ్లీ టీడీపీతో కాపురం…వ్యక్తిగత జీవితంలోనే కాదు…రాజకీయాల్లో కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఘనత పవన్ కల్యాణ్ కే దక్కింది..తాజాగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా దత్తతమ్ముడు, నారా లోకేష్..దత్త బావ బాలయ్య తోడుగా ప్రకటించిన పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటించటాన్ని రేణూ దేశాయ్ వ్యాఖ్యలతో రోజా పోల్చారు. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని గతంలో అన్న రేణు దేశాయ్ వ్యాఖ్యలతో ఈ పొత్తు వ్యాఖ్యలను పోల్చారు.. పవన్ కళ్యాణ్ జెండా చంద్రబాబు ప్యాకేజీ.. అజెండా చంద్రబాబు, లోకేష్‌కు బానిసగా బతకటమని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయని పవన్‌కు చురకలు అంటించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవటం సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది లాంటిదేనని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు సంగతి బీజేపీకి తెలుసునని.. బీజేపీతో చర్చించకుండా టీడీపీతో పొత్తు అని పవన్ కళ్యాణ్ ప్రకటించటం పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమేనని రోజా వ్యాఖ్యానించారు.
ఇక 2018లోనే స్కిల్ కుంభకోణం బయటపడిందని రోజా చెప్పారు.. చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే సీబీఐ, ఈడీ విచారణ చేయమని లేఖ రాయాలని సవాల్ విసిరారు.. ఢిల్లీ వెళుతున్న లోకేష్ అక్కడే ఉన్న ఈడీ, సీబీఐ ఆఫీసుకు వెళ్ళి ఈ కుంభకోణాలపై విచారణ చేయాలని లేఖ ఇవ్వాలని ఆమె సూచించారు. ఎకరం భూమి నుంచి వేల కోట్లు చంద్రబాబుకు ఎక్కడ నుంచి వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉండటం వల్లే ఇన్నేళ్ళు తప్పించుకుని తిరిగాడని రోజా ఫైర్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు స్కాంలను ప్రజలకు వివరిస్తామన్నారు. అరెస్టు దెబ్బతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ భాష మారిందని మంత్రి రోజా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లాం ఉండగానే..వేరొకరితో పిల్లలను కన్నట్లే..బీజేపీతో కాపురం చేస్తూనే…టీడీపీతో పొత్తు అనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ..మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.