రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముసుగుతీసేశారు..ఇన్నాళ్లు చంద్రబాబు దత్తపుత్రుడిగా టీడీపీతో రహస్యబంధం కొనసాగించిన పవన్..ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబు లెక్కిస్తున్న జైలు ఊచల సాక్షిగా తన ముసుగు తీసాడు..పరామార్శ పేరుతో ములాఖత్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు..బయటకు వచ్చి తనను సీఎంగా చూడాలన్న లక్షలాది మంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ..ఇప్పుడు కాకపోయినా..భవిష్యత్తులోనైనా అధికారంలోకి వస్తామని కలలు కన్న వేలాది మంది జనసైనికుల కలలను చిధ్రం చేస్తూ..కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు పాదాల వద్ద కమ్మగా తాకట్టు పెడుతూ.. నిస్సిగ్గుగా టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని..ప్రకటించాడు..ఈ విషయం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని పవన్ ప్రకటించాడంటే..అసలు పార్టీ నేతలతో చర్చించకుండా చంద్రబాబు జైలు గది ఊచల సాక్షిగా బేరం కుదుర్చుకున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది..
ఇన్నాళ్లు జనసేన అధికారంలోకి వస్తుంది..సీఎం అవుతానంటూ..ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు జగన్‌ని ఒంటరిగా ఎదుర్కొలేం కాబట్టే చంద్రబాబుతో కలిసిపోటీ చేస్తామని తన చేతగానితనాన్ని బయటపెట్టుకున్నాడు.. 2019లో విడివిడిగా పోటీ చేసినందుకు నష్టపోయామని, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసి పోటీ చేస్తాయని పవన్ చెప్పుకొచ్చాడు..అప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబును మళ్లీ సీఎం చేయాలనే లక్ష్యంతోనే పవన్ విడిగా కావాలని విడిగా పోటీ చేసినట్లు నాటకం ఆడాడని క్లియర్ గా అర్థమవుతోంది. ఈ నిర్ణయాన్ని జనసేన కార్యవర్గం గుర్తించాలని, తాము ఉమ్మడిగా పోటీ చేసినందువల్ల నష్టం జరిగినా అర్థం చేసుకోవాలని పవన్ బతిమాలుతున్నాడు..ఇప్పటికే పవన్ ని సీఎంగా చూడాలనే కోరికతో కోట్లు ఖర్చుపెట్టుకున్న నేతలు ఇప్పుడు చంద్రబాబుకు ఊడిగం చేయమంటున్న తమ పార్టీ అధినేతను చూసి తలలు పట్టుకుంటున్నారు. రేపటి నుంచే టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ప్రారంభమవుతుందని పవన్ చెప్పుకొచ్చాడు..దీంతో నిన్నటి వరకు కోస్తా జిల్లాలలో కమ్మలతో వైరాన్ని పక్కనపెట్టి…వారితో ఎలా కలిసి పని చేస్తామని .జనసేనను అభిమానించే కాపు నేతలు రగిలిపోతున్నారు.
ఇవాళ “తెలుగుదేశం నేతలతో కలుస్తున్నానంటే అది పాలకపక్షం వల్లే. ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్‌ల మధ్య ఉన్నానంటే అది పాలకపక్షం వల్లే అంటూ పవన్ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు..తన తాబేదార్లతో అన్న చిరంజీవిని అవమానించిన లోకేష్..జనసేనను అభిమానించేవాళ్లంతా సంకర జాతి నా. కొ..డుకులు అంటూ బూతులు తిట్టిన బాలయ్య ను పక్కన చేరాడంటే..తన అన్న చిరంజీవి కంటే..తన సామాజికవర్గం కంటే..చంద్రబాబు విసిరిన ప్యాకేజే ముఖ్యమని పవన్ చెప్పకనే చెప్పినట్లు అయింది.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును చట్టవ్యతిరేకంగా జైల్లో పెట్టారని అందుకే చంద్రబాబుకు నా మద్ధతు ప్రకటిస్తున్నా అని పవన్ చెప్పాడు..అయితే ఒకవేళ చంద్రబాబు కేసులో దోషిగా తేలితే..పవన్ తన మద్దతును ఉపసంహరించుకుని…పొత్తు తెంచుకుంటాడా అనే ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాడు..
014లో విభజన జరిగినపుడు రాష్ట్రానికి నష్టం కలిగింది. 2014లో నేను నరేంద్ర మోదీకి మద్ధతు తెలిపాను.” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. “భారత్ మీద తరచుగా ఉగ్రదాడులు జరిగినపుడు బలమైన నాయకత్వం కావాలనుకున్నాను. నాడు నరేంద్ర మోదీ నన్ను పిలిస్తే నేను వెళ్లాను తప్ప.. నా అంతట నేను కాదు అంటూ పవన్ చెప్పుకొచ్చాడు..అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చెప్పుడు మాటలు విని…మోదీతో విబేధించి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్..ఎన్నికల్లో ఓడిపోగానే అదే చంద్రబాబు ఆదేశాల ప్రకారం కమ్యూనిస్టులను వదిలేసి కాషాయ పార్టీ చంకలో దూరింది నిజం కాదా..ఎన్నికల తర్వాత మోదీకి పవన్‌తో అవసరమే లేదు..అలాంటప్పుడు పవన్‌ని ఎందుకు రమ్మంటాడు..అయినా బాబును మళ్లీ బీజేపీకి దగ్గర చేయాలన్న పచ్చ వ్యూహంలో భాగంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోలేదా…బీజేపీతో పొత్తులో ఉన్నా…ఆ పార్టీతో కంటే టీడీపీకి తోక పార్టీగా ఇన్నాళ్లు రాజకీయం నడపలేదా..అయినా ఇప్పుడు అధికారికంగా పొత్తు అంటున్నాడే కానీ..9 ఏళ్లుగా చంద్రబాబు జేబులో మనిషిగా పవన్ నడుచుకుంటున్న సంగతి ప్రజలకు తెలియదా…
చంద్రబాబుతో నాడు ప్రత్యేక హోదా కోసం విభేదించాను తప్ప.. ఆయనంటే నాకు నమ్మకం. చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా నాకు విశ్వాసం ఉందని జనసేన అధినేత చిలుక పలుకులు పలికాడు.ఇదే పవన్ మీకు మద్దతు ఇచ్చింది…దోచుకోవడానికి కాదు..అంటూ చంద్రబాబు, లోకేష్ ల అవినీతిని ప్రశ్నించింది అంతా ప్రజలను మోసం చేయడానికే అని పవన్ చెప్పకనే చెప్పాడు… బ్యాంకులో తప్పు జరిగితే .. బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఉంది. చంద్రబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారించాలి కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారిస్తుంది?” పవన్ ప్రశ్నించాడు..గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమే విచారణ జరిపిస్తోంది..అసలు స్కిల్ స్కామ్‌లో ఏపీ సీఐడీ కాకుండా ఈడీ విచారిస్తుందా…మనీ ల్యాండరింగ్, హవాలా వంటివి చోటు చేసుకుంటే అప్పుడు ఈడీ ఎంటరవుతోంది..అయినా స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్‌లో అవినీతి జరిగిందని కేంద్ర ఐటీ శాఖ, ఈడీలు రాష్ట్ర సీఐడీకి సమాచారం ఇచ్చింది పవన్ కు తెలియదా అనేది ఆశ్చర్యంగా ఉంది..
మొత్తంగా చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ తన పార్టీని టీడీపీతో మిలాఖత్ చేసుకుని వచ్చాడు..ఇన్నేళ్లు దత్రపుత్రుడిగా రహస్యబంధాన్ని కొనసాగించిన పవన్ జగన్ని ఓడించాలనే లక్ష్యంతో ముసుగుతీసేసి తన ప్యాకేజీ బంధాన్ని బయటపెట్టుకున్నాడు..చంద్రబాబు జైలుకు వెళ్లి..టీడీపీ పతనావస్థకు చేరువయ్యే టైమ్‌లో పార్టీని బలోపేతం చేసుకుని వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి..ఒంటరిగా సీఎం పదవి దక్కించుకునే ఛాన్స్‌ను పవన్ చేజేతులా వదులకున్నాడు..తాను ఎప్పటికీ చంద్రబాబు జేబులో మనిషినేని, వైసీపీ నేతలు అన్నట్లు సినిమాల్లో పవర్ స్టార్ కాని..రాజకీయాల్లో మాత్రం పవర్ లేని ప్యాకేజీ స్టార్ అని తనకు తానే చాటుకున్నాడు..పవన్ చర్యలు ఊహాతీతం..ఆయన ఆర్థం కాడు..ఆయన రాజకీయం అర్థం కాదు..ఇక జనసేన పార్టీని టీడీపీలో అనధికారికంగా విలీనం చేసినట్లే..ఎనీ డౌట్…!