ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే..చంద్రబాబుకు
ఖైదీ నంబర్ 7691 కేటాయించిన జైలు అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సాధారణ ఖైదీల గదులు కాకుండా వీఐపీ ఖైదీలు ఉండే స్నేహా బ్యారక్‌లో ప్రత్యేక గది కేటాయించారు. అయితే చంద్రబాబు వయసు రీత్యా…ఆయనకు చిప్పకూడుకు బదులుగా ఇంటి నుంచి భోజనం క్యారియర్, మందులు తెప్పించుకునే సౌలభ్యం కలిపించారు. ఏదో తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులకు కూడా చేస్తారంటూ..ప్రజల్లో సింపతీ కోసం ఉత్తుత్తి డైలాగులు కొట్టాడే కానీ..నిజంగా తనను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారని ఊహించని బాబుగారు..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇంకా షాక్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది..
అయితే ఇప్పుడిప్పుడే చంద్రబాబు జైలు జీవితానికి అలవాటు పడుతున్నారని. ఆయనని కలిసిన వారు చెబుతున్నారు. ఇప్పటి వరకు జైల్లో ములాఖత్ ద్వారా చంద్రబాబును ఆయన భార్య నారా భువనేశ్వరీ, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ‌్మణీ కలిసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారా భువనేశ్వరీ…చంద్రబాబు కట్టించిన జైల్లోనే ఆయన్ని కట్టిపడేశారంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న స్నేహా బ్యారక్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
రాజమండ్రి జైలులో ఈ స్నేహా బ్లాక్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఈ స్నేహ బ్లాక్ ను జైలులో నిర్మించారు. అప్పట్లో దానిని ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు అదే బ్లాక్ లో ఖైదీగా ఉండటం కర్మ ఫలితమేనంటున్నారు. తాను ప్రారంభించిన బ్లాక్ లోనే తాను ఖైదీగా ఉంటానని బహుశా బాబుగారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ జన్మలో చేసిన పాపాలకు ఖర్మ ఫలితం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది..అయినా చంద్రబాబును విజనరీ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా బాసులు తెగ మోసేస్తుంటారు..నిజంగా చంద్రబాబు ముందు చూపుకు హ్యాట్సాఫ్..తాను ఫ్యూచర్‌లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని గ్రహించిన చంద్రబాబు తన కోసమే ఈ స్నేహా బ్లాక్‌ని ముందుచూపుతో సకల సౌకర్యాలతో కట్టించుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి..అసలు తన కోసం తానే జైలు కట్టుకోవడం కంటే విజన్ ఇంకేముంటుంది. చంద్రబాబు నీ అంత అదృష్టం ఎవరికీ దక్కదు..అసలైన విజనరీ అంటే ఇదే అంటూ నెట్‌జన్లు తెగ ఆడేసుకుంటున్నారు..