వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. పాపం లోకేష్ బ్యాచ్..పచ్చ మీడియా ఛానళ్లు తమ కులదైవాన్ని బయటకు జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు నానాపాట్లు పడుతున్నాయి…అసలు మా బాబు నిప్పు…ఎఫ్‌ఐఆర్‌లో పేరే నమోదు చేయలేదు..గవర్నర్‌కు చెప్పకుండా అరెస్ట్ చేయడం నిబంధనలకు విరుద్దం…అసలు సీమెన్స్ కంపెనీ ఎలాంటి తప్పు జరగలేదని చెప్పింది..ఇలా వక్రభాష్యాలు చెబుతూ…మా బాబుగారు నిప్పులా బయటకు వచ్చేస్తున్నారంటూ ఆదివారం నాడు పచ్చమీడియా..టీడీపీ నేతలతో కలిసి ముందస్తుగా పండుగ చేసుకోంది..
అయితే ఏసీబీ కోర్టు మాత్రం చంద్రబాబే అసలు నిందితుడు అంటూ ఏపీ సీఐడీ ఇచ్చిన ఆధారాలను బట్టి..అనూహ్యంగా 14 రోజుల రిమాండ్ విధించి..రాజమండ్రి సెంట్రల్ జైలకు తరలించాని తీర్పు చెప్పింది. దీంతో మా బాబుగారు కట్టించిన జైల్లో ఆయనకు ప్రాణహానీ ఉందంటూ..హౌజ్ అరెస్ట్ రిమాండ్ ఇవ్వాలంటూ టీడీపీ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో వెంటనే కేసు వేసారు..అయితే అసలే వెన్నుపోటు గురువు అయిన చంద్రబాబుకు అధికారం కోసం ఇంట్లోనే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉండడంతో ఆయనకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్న ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోటు వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు …హౌస్ అరెస్ట్ పిటీషన్‌ను కొట్టేసి..రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు మరింత భద్రత పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకేష్ బ్యాచ్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి..హౌస్ అరెస్ట్ పిటీషన్ ను కొట్టేయడం..మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న సీఐడీ…అమరావతి ఇన్పర్ రింగ్ రోడ్డు కేసులో నిందితుడైన చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీషన్ దాఖలు చేసింది..దీంతో ఏసీబీ కోర్టు మళ్లీ చంద్రబాబును రిమాండ్‌కు అనుమతి ఇస్తుందనే భయంతో టీడీపీ న్యాయవాదులు హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ తో పాటు, స్కిల్ స్కాం కేసు, ACB కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు.
అయితే ఇవాళ హైకోర్టులో కూడా చంద్రబాబుకు చుక్కెదురు అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు రాజకీయ కక్షతోనే తన పేరు ఇరికించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు బెంచ్ ముందు టీడీపీ న్యాయవాదులు క్వాష్ పిటీషన్ పై వాదనలు వినిపించారు. కానీ హైకోర్టు మాత్రం క్వాష్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన బెంచ్…ఇరువైపులా వాదనలు వినాల్సి ఉందంటూ విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది. విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో… ఈనెల 18 వరకు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ విచారణ కూడా హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌పై ఇప్పడే విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాది హైకోర్టు బెంచ్‌తో వాగ్వివాదానికి దిగా… గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జడ్జి కోరారు. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని న్యాయమూర్తి చెప్పగా.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా తెలిపారు. కాగా చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ..కోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఇక చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వచ్చే మంగళవారం వరకు జరిగేలా లేదు..దీంతో మరో వారం రోజులు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సీఐడీ అమరావతిలో జరిగిన వరుస స్కామ్ లపై కోర్టులలో చార్జిషీట్లు దాఖలు చేయనుండడంతో టీడీపీ వర్గాల్లో భయాందోళన నెలకొంది….ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఐపిసి 409 ప్రకారం కేసులు నమోదు కావడంతో తమ అధినేత చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ లభించడం కష్టమేనని, ఇంకొన్నాళ‌్లు జైల్లో ఉంటే..ఇప్పుడున్న సానుభూతి కూడా పోయి..నిప్పు నాయుడు తప్పుడు పనులు చేసి తుప్పుపట్టాడు కాబట్టే జైలుకు వెళ్లాడని ప్రజల్లోకి సంకేతాలు వెళతాయని..ఇక తమ పార్టీని బాలయ్య, లోకేష్‌తో సహా ఎవడూ కాపాడలేడని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.