మళయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
మమ్ముట్టి సోదరి అయిన అమీనా (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారం తుదిశ్వాస విడిచారు..
అమీనాకు ఇద్దరు పిల్లలు.. భర్త ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి తల్లి గారు కూడా మరణించారు. తాజాగా తన సోదరి కూడా దూరమవ్వడంతో మమ్ముట్టి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.