ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు.
మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ డ్రామాలన్నీ ఆడుతున్నాడు. ముఖ్యమంత్రిగా జగన్ రావడంతోనే ప్రపంచ పటంలోనే ఆంధ్రప్రదేశ్ లేకుండా పోయింది.
లక్షల కోట్ల భక్షక అవినీతి సామ్రాట్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక . రాష్ట్రానికి రావణ పాలనను రుచి చూపించిన ఆధునీక రావణుసురుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. జన మాన ధన చోరక మన ముఖ్యమంత్రి ఆయన సెటైర్లు వేశారు.