Home / ANDHRAPRADESH / టీడీపీ పగ్గాలు బాలయ్య చేతిలోకి…ఇక నారా చరిత్ర సమాప్తం..!

టీడీపీ పగ్గాలు బాలయ్య చేతిలోకి…ఇక నారా చరిత్ర సమాప్తం..!

వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు పడి చచ్చిందన్న సామెత..ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరెక్టుగా సూటవుతోంది..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేసి, చట్టాలను తన చుట్టంగా చేసుకుని, న్యాయాన్ని తన గుమ్మంలో కట్టేసుకుని, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా..నేను నిప్పు..నన్నెవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగిన స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది..ఒక్క స్కిల్ స్కామ్ మాత్రమే కాదు…అమరావతి ల్యాండ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, 118 కోట్ల ముడుపుల ఐటీ కేసు..ఇలా చంద్రబాబు మెడపై కేసుల కత్తి వెంటాడుతోంది..ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో బెయిల్ వచ్చినా..ఆ తర్వాత వరుస కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళతాడన్న టాక్ నడుస్తోంది…దీంతో టీడీపీని నడిపించేవారు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది..

ఇక యువగళం పాదయాత్రలో ఉచ్చపోయిస్తా..కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ డైలాగులు మీద డైలాగులు కొడుతున్నా…నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సీన్ లేదని అర్థమైనట్లు ఉంది..ఇప్పటి వరకు కూతురు కాపురం కోసం బావ చంద్రబాబు వెనుక తోకాడించుకుంటూ తిరిగిన బాలయ్య..ఇప్పుడు సింహంలా తెరమీదకు వచ్చారు. విజయవాడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో బావ చంద్రబాబు సీట్లో కూర్చున్న బాలయ్య…చంద్ర‌బాబును అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవ‌రికీ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..”నేను వ‌స్తున్నాను. ముందుంటాను. తెలుగు వారి పౌరుషం ఏంటో చూపిస్తాం. ఇలాంటివి ఎన్నె తెలుగుదేశం పార్టీ చూసిందంటూ ఓ రేంజ్‌లో డైలాగులు పేల్చారు. పనిలో పనిగా జగన్‌పై తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. దీంతో బాలయ్య కామెంట్స్ ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ముఖ్యంగా నారా వర్గంలో అలజడి రేపుతున్నాయి…

ఇన్నాళ్లు .. చంద్రబాబు నా తండ్రికి వెన్నుపోటు పొడిచినా..మా నందమూరి అన్నదమ్ములను వెధవలను చేసినా.. .అల్లుడు ఎన్ని బిత్తిరి వేషాలు వేసినా కూతురి కాపురం కోసం సైలెంట్‌గా ఉన్నా..ఇప్పుడు రాక రాక అవకాశం వచ్చింది…ఇక టీడీపీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలోకి రావడానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాడేమో..బాలయ్య ఏకంగా బావ జైల్లో ఖైదీగా ఉన్న టైమ్ లో ఆయన సీట్లో కూర్చుని పార్టీని నడిపించేందుకు రెడీ అవుతున్నాడు..దీంతో ఇటు బాలయ్య ఫ్యాన్స్..అటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది..ఈ తెగువ, ధైర్యం మీ నాన్నకు వెన్నుపోటు పొడిచినప్పుడే చూపి ఉంటే…అప్పుడే బాలయ్య సీఎం అయ్యేవాడు..అప్పటికే ఎన్టీఆర్ తన వారసుడు బాలయ్యే అని ప్రకటించారు..కేవలం చంద్రబాబు మాయలో పడి..దేవుడి లాంటి తండ్రికి వెన్నుపోటు పొడవడంలో సహకరించాడు..బాలయ్యకు ఇప్పుడిదే మంచి ఛాన్స్..పార్టీని చంద్రబాబు చేతిలోంచి తిరిగి తమ కుటుంబం చేతిలోకి తీసుకోవడానికి అంటున్నారు నందమూరి అభిమానులు..
మరోవైపు కొందరు కుల పిచ్చి అధికంగా ఉన్న బాలయ్య వీరాభిమానులు మాత్రం భవిష్యత్తులో చంద్రబాబు తదనంతరం లోకేష్ కు అంత సీన్ లేదు..కాబట్టిపార్టీ ఎలాగూ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళుతుంది..క్రాస్ బ్రీడ్ అయిన జూ. ఎన్టీఆర్ కంటే..తమ కుల దైవం అయిన ఎన్టీఆర్ వారసుడు బాలయ్యే టీడీపీ అధ్యక్షుడు..ఆ తర్వాత సీఎం కావాలని…భావిస్తున్నారు…

మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ నారా వర్గం, నందమూరి వర్గాలుగా చీలిపోతుందా..త్వరలోనే పార్టీ చంద్రబాబు చేతిలోంచి బాలయ్య చేతిలోకి వెళుతుందా…నారా చరిత్ర సమాప్తమై..ఇక నందమూరి శకం మళ్లీ రీస్టార్ట్ అవుతుందా..అనేది తెలుగు తమ్ముళ్లల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది..కమాన్ బాలయ్య ..ఇదే మంచి ఛాన్స్..సింహంలా రెచ్చిపో..నీ తండ్రికి వెన్నుపోటు పొడిచి..ఆయన చావుకు కారకుడైన చంద్రబాబుకు నువ్వు వెన్నుపోటు పొడిచి..పార్టీని మళ్లీ నీ గుప్పిట్లోకి తీసుకో…అప్పుడైనా పెద్ద ఎన్టీఆర్ ఆత్మశాంతిస్తుందని కొందరు నందమూరి అభిమానులు బాలయ్యను వేడుకుంటారు..అయితే సినిమాల్లో సింహంలా రెచ్చిపోయే బాలయ్య..బయట మాత్రం బెబ్బే అంటుంటారు..మరీ బాబు కుర్చీ నుంచి దించేసి టీడీపీ పగ్గాలు తీసుకుంటాడా…లేదా…కూతురి కాపురం కోసం మళ్లీ బావ బయటకు వచ్చేదాకా పార్టీకి కాపలా కాస్తాడా అనేది చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat