Home / ANDHRAPRADESH / ఇంట్లో చంద్రబాబు ప్రాణాలకు గ్యారంటీ ఉందా…హౌస్ రిమాండ్ పిటీషన్ కొట్టివేత..!

ఇంట్లో చంద్రబాబు ప్రాణాలకు గ్యారంటీ ఉందా…హౌస్ రిమాండ్ పిటీషన్ కొట్టివేత..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఆయన తనయుడు లోకేష్ తో సహా , కుల పెద్దలు, పచ్చ మీడియా బాసులు తెగ వర్రీ అవుతున్నారు..అరెస్ట్ చేసిన రోజు చంద్రబాబు పేరు అసలు ఎఫ్‌ఐఆర్‌లోనే లేదు…ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు..అంటూ కుంటిసాకులు చెబుతూ..ఇక బాబు బయటకు వచ్చేసినట్లే అని పండుగ చేసుకున్న టీడీపీ నేతలకు, పచ్చ మీడియా ఛానళ్లకు ఏసీబీ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది…చంద్రబాబు ఏపీ స్కిల్ స్కామ్‌లో ఉద్దేశపూర్వకంగా ప్రజధనాన్ని దుర్వినియోగం చేసి…ఆ డబ్బును విదేశాలకు తరలించి…తిరిగి బోగస్ సంస్థల ద్వారా ఎలా కొట్టేసారంటో ఆధారాలు సమర్పించిన ఏపీ సీఐడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్డు జడ్డి హిమబిందు…చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు..అయితే జైలులో చిప్పకూడు తినకుండా చంద్రబాబుపై దయ తల్చిన కోర్టు..ఇంటి నుంచి భోజనం, మందులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది..

కాగా  స్కిల్‌ స్కాంలో ఏ1 చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ను.. హౌజ్‌ రిమాండ్‌గా పరిగణించాలని, ఈ మేరకు ఇంట్లోనే ఉండేందుకు ‘హౌజ్‌ అరెస్ట్‌’ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.  ఈ విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఐడీ  కౌంటర్‌ దాఖలు చేసింది. జైల్లో చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఖరీదైన న్యాయవాది లూథ్రా అతి తెలివితేటలు కూడా ప్రభుత్వ అడ్వకేట్ ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు ముందు ఉడకలేదు..  రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు ముప్పు లేదని.. ఆయన పూర్తి భద్రతలో ఉన్నారని.. జైలులో ‌ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం‌ పిటిషన్‌కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు   ఏఏజీ సుధాకర్ రెడ్డి పొన్నవోలు.

ఇప్పటికే స్కిల్ స్కామ్, 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఇద్దరు ప్రధాన నిందితులైన చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసానిలను విదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా పంపించేశారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు..కాబట్టి…చంద్రబాబుకు హౌస్ కస్టడీ కాకుండా…విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతోనే ఏకీభవించారు. చంద్రబాబు హౌజ్‌ కస్టడీ పిటిసన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

ఇంట్లో వుండే భద్రత కంటే.. జైల్లో వుండే భద్రత ఎక్కువ. హౌస్ అరెస్ట్ లో ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత?. జైల్లో భద్రత కల్పిస్తున్న వాటిపై అన్ని అంశాలు స్పష్టంగా సీఐడీ చెప్పింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపకపోవడంతో డిస్మిస్ చేస్తున్నాం. హౌస్ కస్టడీలో ఉంచేందుకు చట్టపరమైన నియమ నిబంధనలను ఏసీబీ కోర్టు ఎదుట చూపలేదు. ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం అంటూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును హౌస్ కస్టడీ ద్వారా జైలు నుంచి బయటకు తీసుకురావాలన్న లోకేష్ బ్యాచ్‌కు, పచ్చమీడియాకు మరోసారి ఏసీబీ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat