ఏపీలో పెనుసంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు పెట్టారని మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ వ్యాఖ్యలపై సీఐడీ స్పందించింది.
‘రమేశ్ స్టేట్మెంట్లోనే కేసు మొత్తం నడవలేదు. దర్యాప్తులో ఇది భాగం మాత్రమే. అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉండగా రమేశ్ ఇలా వ్యాఖ్యానించడం అయోమయానికి గురిచేయడమే.
దర్యాప్తును ప్రభావితం చేయడమే. హాస్యాస్పదంగా, పేలవంగానో కేసు బిల్డ్ చేయలేదు’ అని సీఐడీ వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి.