కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మధుసూధనా రెడ్డి నగర్ లో ఈ సందర్బంగా తమ కాలనీ అభివృద్ధికి మరియు కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ.. అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి…సి సి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సరఫరా వ్యవస్థ పనుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి.. మా కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి తమకు అండగా నిలిచినందుకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారికి రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్తి మద్దతు అందజేస్తామని.. కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని కాలనీ వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం కాలనీ లో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారి తండ్రిగారి పేరుమీద ఏర్పాటుచేసిన కె ఎం పాండు మెమోరియల్ ట్రస్ట్ స్వచ్చంద సేవ సంస్థ ద్వారా నిర్మించనున్న సంక్షేమ సంగం భావన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అథిదిగా మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు శ్రీ కె ఎం గౌరీష్ గారితో కలిసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనను కన్నా బిడ్డలా ఆదరిస్తూ ఏ కాలనీ కి బస్తీకి వెళ్లిన ప్రేమానురాగాలతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్ననియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లపుడు రుణపడివుంటానని. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు కెటీఆర్ గారి సహకారంతో నియోజికవర్గాని మన రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిదుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ నాగన్న, జనరల్ సెక్రటరీ ఎన్ . శ్రీనివాస్, కౌశాధికారి మధు, ఆర్.ప్రసాద్ రావు, రగుమా రెడ్డి, చెన్నయ్య, కుమార స్వామి, రమేష్, సంతోష్, డి శ్రీనివాస్, శేషగిరి రావు, జి మల్లేష్, ఎన్ వీ ఎస్ కుమార్, మూర్తి, నాయుడు, పుల్లారావు, డి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.