సూర్యాపే పరిసర ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ వద్ద వరంగల్ – సూర్యాపేట రహదారి పై నూతన ఆలయం లో కొలువుదీరిన దండు మైన్సమ్మ తల్లి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు.
సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దండు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.