ఏపీలో అప్పటి ప్రభుత్వ హాయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని వైసీపీఎమ్మెల్యే.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు చాలా దిట్ట. కానీ ఆయన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది అని మాజీ మంత్రి అనిల్ విమర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తీగ లాగితే డోంక కదులుతుంది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడం లేదు ఆయన ప్రశ్నించాడు.