చాకలి(చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు.వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అన్నారు.మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు,పలువురు రజక నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.