ఏపీలో .టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్‌మెంట్ స్కామ్‌లో గత కొన్నేళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలించనున్న సీఐడీ అధికారులు కాసేపట్లో మూడో అదనపు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అయితే అరెస్టుకు ముందు చంద్రబాబు, టీడీపీ నేతలతో కలిసి హైడ్రామా క్రియేట్ చేశారు..రిమాండ్ రిపోర్ట్ ఏదీ…నన్ను అరెస్ట్ చేయడానికి మీకేం హక్కు…అసలు ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదంటూ దబాయించారు..అయితే రిమాండ్ రిపోర్ట్ తో సహా అన్ని వివరాలు చెబుతామంటూ సీఐడీ అధికారులు వివరణ ఇవ్వడంతో చేసేదేమి లేక అరెస్ట్ కు చంద్రబాబు అంగీకరించారు. తనపై జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను పచ్చ మీడియా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తోంది.
అయితే చంద్రబాబు అరెస్ట్ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎలాంటి దురుద్దేశాలు లకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని సజ్జల స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్ లేదు.. నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని,, ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ దబాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఈ కేసు చాలా బలంగా ఉంది. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్‌ఆఐర్ నమోదు అయిందని..సజ్జల క్లారిటీ ఇచ్చారు. . 2021 డిసెంబర్‌లో(9-12-2021) సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కానీ, 2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం.. రూ.241 కోట్లు డైవర్ట్ అయ్యిందని బయటపెట్టింది. ఎఫ్‌ఐఆర్ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్ బయటపడింది. స్కాంలో అప్పటి సీఎం పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయని సజ్జల సంచలన నిజాలు వెల్లడించారు. షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్లు నిధులు విదేశాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌కు ముందే స్కామ్ బయటపడిందని సజ్జల వివరణ ఇచ్చారు. సీమెన్స్ సంస‌్థతో తేదీ లేని ఎంవోయూ కుదర్చుకున్నారని, దీనిపై అప్పుడు ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని అన్నారు.. జీవో ప్రకారం ఏదీ జరగలేదు.. అన్నీ పక్కకు పెట్టారని తెలిపారు. . ఇది 100 శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కాం అయిపోయింది. నోట్‌ఫైల్స్‌లో కూడా అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. .
డిజైన్‌టెక్ ద్వారా హవాలా డబ్బు టీడీపీ వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిందని సీఐడీ గుర్తించిందని.. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే స్కాం జరిగిందని గుర్తించి ఆధారాలు చూపించి మరీ సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. 2018లోనే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ లో భారీ అవినీతి జరిగిందని ఓ విజిల్ బ్లోయర్ ద్వారా ఈ స్కామ్ బయటపడిన విషయాన్ని సజ్జల చంద్రబాబుకు గుర్తు చేశారు. . చాలా రాష్ట్రాల్లో ఈ స్కామ్‌పై ఏజన్సీలు దర్యాప్తు చేశాయి. తన హయాంలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతిగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదని సజ్జల ప్రశ్నించారు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం. అయినా.. రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా?. స్కామ్‌లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు. రాజకీయ దురుద్దేశమే ఉంటే అరెస్ట్‌కు ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది? ఎప్పుడు తీసుకువచ్చి లోపల వేసేవాళ్లం కదా అంటూ సజ్జల చంద్రబాబు అండ్ కోకు కౌంటర్ ఇచ్చారు. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లిందనేది తేలడానికి టైం పట్టింది. బెనిఫీషియరీ కూడా చంద్రబాబే అని తేలడంతో ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆయన్నేదో కరుణానిధిని అరెస్ట్ చేసినట్లు అర్ధరాత్రి ఏమీ అరెస్ట్ చేయలేదు. పకడ్బందీగా ప్లాన్ చేసిన స్కామ్ కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అని సజ్జల స్పష్టం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిన స్కామ్ కాదని..పక్కా ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికాడని సజ్జల తేల్చిచెప్పారు.