Home / ANDHRAPRADESH / ఐటీ స్కామ్‌లో ఇద్దరు నిందితులను దేశం దాటించిన చంద్రబాబు..?వాటే ఐడియా సర్‌జీ..!

ఐటీ స్కామ్‌లో ఇద్దరు నిందితులను దేశం దాటించిన చంద్రబాబు..?వాటే ఐడియా సర్‌జీ..!

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయాల్లో అపర చాణక్యుడని పచ్చగా వర్థిల్లుతున్న కుల మీడియా డప్పేస్తూ ఉంటుంది..నిజమే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ ఆడియోలతో అడ్డంగా దొరికిపోయి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేకెత్తించి తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే…అమరావతిలో చేతికి మట్టి అంటకుండా బినామీల పేరుతో వేల కోట్లు దోచుకున్నా..పలు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి 18 స్టేలు తెచ్చుకుని నేటికి విచారణ జరగకుండా జాగ్రత్తపడుతున్న చంద్రబాబు..నిజంగా అపర చాణక్యుడే..అమరావతిలో తాత్కాలిక భవనాల కాంట్రాక్టుల పేరుతో ప్రజల డబ్బులు బోగస్ కంపెనీల పేరుతో మళ్లించి…ప్రతిగా కాంట్రాక్టు సంస్థల నుంచి వందల కోట్లు నొక్కేసినా..ఐటీ శాఖ నోటీసులిచ్చినా..మీ జ్యుడిషియరీ ఏంటీ అంటూ సాంకేతిక కారణాలతో అడ్డంగా బుకాయించే చంద్రబాబు అపర చాణక్యుడే..తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగినా.. .విధ్వంసాలు సృష్టించి..సమస్యను పక్కదారి పట్టించి..తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడే..

అయితే తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ శాఖ నోటీసుల్లో తన పీఏ శ్రీనివాస్ , బ్లాక్ మనీ తరలింపులో సహకరించిన ‎షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని , లోకేష్ సన్నిహితుడైన కిలారు రాజేష్ ల మధ్య కోడ్ లాంగ్వేజీలో కోట్ల డబ్బు తరలింపుకు సంబంధించి వాట్సాప్ ఛాటింగ్ లను బయటపెట్టడంతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది..ఇన్నాళ్లు అన్ని కేసులు ఒకెత్తు…ఈ కేసు మరొక ఎత్తు అని భావించిన చంద్రబాబు ఇక తాను అరెస్ట్ కాకతప్పదని గ్రహించాడు..అందుకే తనను 2, 3 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..తనపై భౌతికదాడులకు పాల్పడుతారంటూ తెలుగు తమ్ముళ్లతో విధ్వంసం చేయించేందుకు స్కెచ్ వేస్తూనే..ఈ కేసులోంచి తప్పించుకునేందుకు తనలోని క్రిమినల్ మైండ్ కు పదును పెట్టారు…అందులో భాగంగా చంద్రబాబు చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ నోటీసుల సమాచారం తెలుసుకుని ఇద్దరు ప్రధాన నిందితులు విదేశాలకు పరారయ్యారు. ఈనెల 5న సాయంత్రం 7.10 గంటలకు ప్రధాన నిందితుడైన దుబాయ్‌కు మనోజ్‌ వాసుదేవ్‌ పారిపోయారు దుబాయ్‌కు జంప్ అయ్యాడు..ఇక 118 కోట్ల ముడుపుల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస రావు కూడా హైదరాబాద్‌ నివాసంలో లేరు. శ్రీనివాసరావు ఈనెల 6న అమెరికాకు పరారయ్యారు. షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేష్‌ గుప్తా మాత్రం ఐటీ విచారణకు హాజరవుతానని తెలిపారు.

ఇదిలా ఉంటే..2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్‌ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్‌గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో గత వారం తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్‌ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్‌లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్‌అండ్‌టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఐటీ శాఖ వద్దు అన్ని ఆధారాలు ఉండడంతో చంద్రబాబు తనలోని క్రిమినల్ బుర్రకు పదును పెట్టి..ఇద్దరు ప్రధాన నిందితులను ఐటీ అధికారుల కళ్లు గప్పి దేశం దాటించాడని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు నిందితులను భారత్ కు తీసుకురావాలంటే..పోలీసులకు, ఐటీ అధికారులకు చాలా కాలం పడుతోంది..ఈలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోయి..ఎన్నికలు కూడా అయిపోతాయి…అందుకే సమస్యలు వచ్చినప్పుడల్లా తన క్రిమినల్ మైండ్ సెట్ తో సునాయసంగా తప్పించుకుంటారు..పెద్ద పెద్ద మాఫియా డాన్ లు కూడా ఆయన ముందు దిగదుడుపే..దటీజ్ చంద్రబాబు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat