బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
ఈ చిత్రంలో షారుక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.తొలి రోజు జవాన్‌కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించాడు.
నార్త్‌లో ఏ స్థాయిలో ఈ సినిమాకు ఆదరణ దక్కుతుందో సౌత్‌లోనూ అదే స్థాయిలో దక్కుతోంది. ముఖ్యంగా తెలుగులో రూ.12 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు పఠాన్ చిత్రం తొలి రోజు రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు తన రికార్డును జవాన్‌తో బద్దలు కొట్టాడు కింగ్ ఖాన్.