నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రకు కుల మీడియా ఎన్ని జాకీలు వేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా లాభం లేకుండా పోతుంది.. అసలు పాదయాత్రల చరిత్రలో ఇంత నీరసంగా సాగుతున్న యాత్ర అంటే అది..లోకేష్ పాదయాత్రే…లోకేష్ వంధిమాగధులు, పనివాళ్లు.స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులే తప్పా…సామాన్య ప్రజలెవరూ లోకేష్ పాదయాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు.కాకపోతే తమ కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో మాత్రం లోకేష్ ను చూసేందుకు పోటేత్తారు..ఈ రెండు జిల్లాలలోనే కాస్తో కూస్తో లోకేషానికి ఆదరణ దక్కింది..ఎప్పుడైతే గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడో లోకేష్ కు జనాలు ముఖం చాటేస్తున్నారు..ఎక్కడ ఉచ్చపోయిస్తాడో..లేదా కట్ డ్రాయర్ల మీద రోడ్ల మీద తిప్పుతాడో అని భయపడ్డారేమో కానీ..కుర్రోళ్లంతా లోకేష్ ఊరిలోకి అడుగుపెట్టగానే చినబాబు వస్తున్నాడు..ఉచ్చ పోయాస్తాడంట..పారిపోండిరోయ్ అంటూ సైడ్ అయిపోతున్నారని టాక్..
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నారా లోకేశ్ నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన కరువైంది. నరసాపురం నియోజకవర్గంలో జనం లేక పాదయాత్ర వెలవెలబోయింది. దీంతో చినబాబుకు చిర్రెత్తిపోయింది..నేను వస్తున్నానని తెలిసి కూడా జనాలను తరలించకపోతే ఎలా..అంటూ స్థానిక టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇక పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి పెదమామిడిపల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు జన స్పందన కరువైంది. దిగమర్రు మూడు రోడ్ల కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఖాళీ బిందెలు ప్రదర్శించి మంచినీటి సమస్య ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దిగమర్రు గ్రామంలో కాసేపు కల్లుగీత కార్మికులతో మాట్లాడారు.
పెదమామిడిపల్లి చేరుకునేసరికి చీకటి పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కాగడాలు వెలిగించి ఆగస్టులో కూడా విద్యుత్ కోతలంటూ దుష్ప్రచారం చేశారు. కార్యకర్తలకు పెట్రోల్ కోసం రూ.100, మగవారికి రూ.500, ఆడవారికి రూ.300 చెల్లించి పాదయాత్రకు తరలించినట్టు సమాచారం. ఇక పాదయాత్రలో జై బాలయ్య, జై జై నిమ్మల అనే నినాదాలే వినిపించడంతో లోకేష్ కు ర్రెత్తిపోయిందంట..కార్యకర్తలను ఏమన్నా అంటే ఉన్నవాళ్లు కూడా పాదయాత్ర నుంచి జంప్ అవుతారని సైలెంట్ అయ్యాడంట..ఇదే గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటేత్తారు..కాపులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పవన్ కు సహజంగానే బ్రహ్మరథం పట్టారు..కానీ లోకేష్ కు మాత్రం జనాలు ముఖం చాటేస్తున్నారు..అందుకే తన అసలు కొడుకు లోకేష్ పవన్ క్రేజ్ ముందు ఎక్కడ సైడ్ అయిపోతేడేమో అని భయపడిన చంద్రబాబు…దత్తపుత్రుడిని బతిమాలుకుని వారాహి యాత్రను డిసెంబర్ వరకు వాయిదా వేయించాడని..టాక్…కానీ లోకేష్ పాదయాత్రకు జనం నుంచి స్పందన అంతంత మాత్రమే.. దీన్ని బట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కష్టకాలమే అని, జనసేనతో పొత్తు పెట్టుకోకుంటే ఇక అంతే సంగతులని, లోకేష్ పాదయాత్ర చెప్పకనే చెబుతోంది.