Home / ANDHRAPRADESH / చంద్రబాబు 118 కోట్ల స్కామ్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన కామెంట్స్..!

చంద్రబాబు 118 కోట్ల స్కామ్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన కామెంట్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంలో అడ్డంగా ఇరుక్కున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కనీసం ఆధారాలు కూడా దొర్కకుండా…బినామీల పేరుతో , బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్లు నొక్కేసి కూడా తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబును ఇప్పుడు ఈ 118 కోట్ల స్కామ్ భయపెడుతోంది..దీనికి కారణం చంద్రబాబు ఏ‍ ఏ షెల్ కంపెనీలు సృష్టించి..ప్రజా ధనాన్ని దారి మళ్లించి…పాపూర్ జీ పల్లోంజీ గ్రూపు ప్రతినిధుల నుంచి తన పీఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ పార్థసాని, రఘురేలా, లోకేష్ సన్నిహితుడైన కిలారు రాజేష్ వంటి బినామీల ద్వారా వందల కోట్ల బ్లాక్ మనీనీ కోడ్ లాంగ్వేజీలో ఎలా తరలించారో..ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన 46 పేజీల నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..

అందుకే కేంద్రంలోని ఐటీ శాఖ నోటీసులిస్తే..ఇక్కడ జగన్ సర్కార్ తనపై కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారంటూ భయాందోళన చెందుతూ ప్రజల్లో సింపతీ కొట్టేసేందుకు కొత్త డ్రామా మొదలెట్టాడు..అంతే కాదు ఐటీ కేసులో తాను నిండా కూరుకుపోయానని గ్రహించిన చంద్రబాబు తనలోని క్రిమినల్ బుర్రకు పదను పెట్టి..ఇద్దరు ప్రధాన నిందితులను దేశం దాటించాడు. తన పీఏ శ్రీనివాస్ అమెరికాకు చెక్కేస్తే, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దుబాయ్ కు దొబ్బేసాడు..ఇప్పుడు ఆ ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకువచ్చేసరికి ఏదో ఒక రచ్చ లేపి…ఇష్యూని డైవర్ట్ చేసి పడేస్తాడు..

అయితే తాజాగా చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. లెక్కల్లో చూపని ఆదాయంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబుతో సహా ఎవరైనా సమాధానం చెప్పాల్సిందేనని జేడీ తేల్చి చెప్పారు.గుంటూరు (d) అత్తోటలో పర్యటిస్తున్న జేడీ లక్ష్మీనారాయణను మీడియా చుట్టుముట్టి చంద్రబాబు ఐటీ నోటీసులపై ప్రశ్నించింది..దీనికి ఆయన సమాధానం ఇస్తూ..ఐటీ వివరణ కోరిన 118 కోట్లకు చంద్రబాబు లెక్కలు చెప్పాల్సిందే..సరైన ఆన్సర్ చెప్పకపోతే..ఐటీ శాఖ విధించిన జరిమానా కట్టాల్సి వస్తోంది..లేదా ఈ ముడుపుల బాగోతంలో భారీ అవినీతి జరిగిందని తేలితే..దర్యాప్తు చేస్తుంది..నేరం రుజువైతే పదేళ్ల పాటు జైలు, లేదా..ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని..సీబీఐ మాజీ జేడీ పరోక్షంగా చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat