రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు..మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ విచారణ షురూ అయింది…ఇక ఇటీవల పుంగనూరు విధ్వంసంలో చంద్రబాబుపై కేసులు నమోదు అయ్యాయి..దీంతో ఎక్కడ చెరసాలలో చిప్పకూడు తినాల్సి వస్తుందోనని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు ఎప్పుడూ లేనంతగా భయంపట్టుకుంది..అందుకే రెండు, మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి బేల పలుకులు పలుకుతూ..తెలుగు తమ్ముళ్లను ముందస్తుగా విధ్వంసానికి ప్రిపేర్ చేస్తున్నాడు..ఎన్ని అరాచకాలు చేసినా తాను నిప్పులా బతికానంటూ తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా తగలబడిపోతుందంటూ ముందస్తుగా పచ్చ గూండాలను ప్రిపేర్ చేస్తున్నారు..అయితే టీడీపీ అధినేత చంద్రబాబు రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంపై ఇటు కుల మీడియా, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, కమ్మనిస్టులుగా మారిన కమ్యూనిస్టులు అంతా గప్‌చుప్..దీనికి కారణం బాబుగారి ప్యాకేజీ మహిమ అని పెద్దగా చెప్పనక్కర్లేదు..
అయితే కోడ్ భాషలో కోట్లు కొట్టేసిన సీబీఎన్ గ్యాంగ్ ని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెడుగుడు ఆడేసుకుంటున్నారు..వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, మంత్రి అంబటి రాంబాబు, పేర్నినాని తదితరులు చంద్రబాబును పంచ్ డైలాగులతో పచ్చడి చేస్తున్నారు. ఇక బ్రో మూవీలో తనను ఇమిటేట్ చేసి ఆడుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అంబటి రాంబాబు ఎలా చుక్కలు చూపించారో అందరికీ తెలిసిందే..తాజాగా చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంపై నోరెత్తని పవన్ కల్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా అంబటి సెటైర్లతో చెలరేగిపోయారు. రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులను ప్రస్తావించిన అంబటి …పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ..హలో..ఏమైపోయావ్ బ్రో..బాబుగారు జైలుకు వెళతానంటున్నారు..వచ్చి పలకరించి..పులకరించిపో..అంటూ అంబటి అదిరిపోయే ట్వీట్ చేశారు. పవన్, చంద్రబాబుపై అంబటి వేసిన బ్రో ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.