టీడీపీ అధినేత చంద్రబాబును అపర చాణక్యుడు అని ఆయన కుల మీడియా భజన చేస్తుంది..నిజమే.. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా…వివిధ అవినీతి కేసుల్లో విచారణ జరపకుండా కోర్టుల నుంచి ఏకంగా 18 స్టేలు తెచ్చుకున్నా.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు నొక్కేసినా.. తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడు కాకపోతే మరేటీ.. తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ శాఖ నోటీసులు రావడంతో చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో బుకాయింపులకు దిగాడు..ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ అడ్డంగా దొరికిన చంద్రబాబు అర్థరాత్రి దొంగలా బెజవాడ కరకట్టకు పారిపోయి..నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ పోలీసులకు ఎవరూ అధికారమిచ్చారు…నాకు ఏసీబీ ఉంది..సెక్షన్ 8 అంటూ అప్పుడు రాష్ట్ర విభజన సమయంలో తెలుగు ప్రజల మధ‌్య ఉన్న భావోద్వేగాలను రెచ్చగొట్టి…తెలివిగా తప్పించుకున్నాడు..సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా ఐటీ నోటీసులతో అరెస్ట్ భయంతో వణికిపోతున్న చంద్రబాబు..తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందని, 2, 3 రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి…రాష్ట్రంలో విధ్వంసం రగిలించి…శాంతి భద్రతలు సమస్యలు సృష్టించి తాను బయటపడాలని పథకం పన్నాడు..దీనిలో భాగమే మొన్న పుంగనూరు, నిన్న భీమవరంలో పచ్చమూకలు సాగించిన అరాచక దాడులు.
అయితే చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కరడుగట్టిన స్మగ్లర్లు, అంతర్జాతీయ మాఫియా ముఠాలను తలదన్నేలా పచ్చ మాఫియా ఎలా కోట్లాది రూపాయలను కొల్లగొట్టిందో ఐటీ నోటీసుల్లో వెల్లడైంది..కోటి రూపాయలంటే ఒక టన్ను స్టీల్ అని, విశాఖ అంటే విష్, విజయవాడ అంటే విజయ్ అని…ఇలా కోడ్ పదాలతో పచ్చ ముఠా యధేచ్ఛగా బాబుగారి బంగ్లాలకు కోట్లాది రూపాయలను తరలించిన వైనం ఐటీ నోటీసుట్లో బట్టబయలైంది. సీబీఎన్ గ్యాంగ్ కోడ్ భాషలో కోట్లు కొట్టేసిన వైనంపై విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. కోటి రూపాయలంటే ఒక టన్ను స్టీల్ అనే పదజాలాన్ని కూడా చేర్చాలని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేర్చాలంటూ ఉత్సాహవంతులైన యువతీ, యువకులు కోరుకుంటోన్నారని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ యాజమాన్యానికి వారు మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
టన్ను స్టీల్ అనే పదాన్ని కోటి రూపాయలకు ప్రత్యామ్నాయంగా వాడిన ఆ క్రెడిట్ కూడా చంద్రబాబుకే దక్కుతుందని పంచ్ వేశారు. కొత్త కొత్త టెక్నాలజీని కనుగొన్న చంద్రబాబు ఈ పదాలను కూడా సృష్టించగలరని చురకలు అంటించారు. స్టీల్ టన్నుల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి నేరుగా 118.93 కోట్ల రూపాయలను చంద్రబాబు అందుకున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బోగస్ కంపెనీలైన హయగ్రీవ- రూ.11.12 కోట్లు, షకలక, అన్నై- రూ.33.76 కోట్లు, ఎవరెట్, నయోలిన్- రూ.50.43 కోట్లు, పౌర్ ట్రేడింగ్ నుంచి 9.42 కోట్ల రూపాయలను చంద్రబాబు మళ్లించాడని ఆరోపించారు. అలాగే ఫొనిక్స్- రూ. 18.14 కోట్లు, లక్ స్టోన్- రూ. 1.23 కోట్ల రూపాయలను మళ్లించాడని, అవన్నీ బోగస్ కంపెనీలేనని, సూట్‌కేసుల్లో డబ్బులను తీసుకోవడానికే వాటిని స్థాపించినట్లు చూపించాడని ధ్వజమెత్తారు. ఇవికాకుండా దుబాయ్‌లో దినార్ల రూపంలో అందినవి మరో 15.13 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఈ వివరాలు ఫేక్ అని చెప్పే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. మొత్తంగా కోడ్ లాంగ్వేజ్ లో కోట్లు కొట్టేసిన నారావారి మాఫియా బాగోతాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూనే…ఏఏ సూట్ కేసు కంపెనీల నుంచి ప్రజల డబ్బును చంద్రబాబు ఎలా మళ్లించాడో బయటపెట్టారు. ప్రస్తుతం కోడ్ లాంగ్వేజీలో కోట్లు కొల్లగొట్టిన నారావారి మాఫియా కంపెనీ బాగోతం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.