ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ మంత్రులపై లోకేష్ తో సహా టీడీపీ నేతల బూతులు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి…ఈ పచ్చ బూతు నేతల్లో అందరికంటే ముందు వరుసలో ఉంటాడు .. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సోయి కూడా లేకుండా.. సీఎం జగన్ పై నా కొడకా…అంటూ బూతులు తిట్టి పైగా మైడియర్ సన్ అన్నానంటూ బుకాయించిన ఘనుడు ఈయన.. ఒక మహిళ అని కూడా చూడకుండా.. రా..నా మగతనం ఏంటో చూపిస్తా అంటూ…మంత్రి రోజాపై అసభ్యంగా కారుకూతలు కూసిన చిల్లర నేత..ఈ చింతకాయల..
తాజాగా లోకేష్ పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన యువగళం బహిరంగ సభలో అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై అసభ్యకరంగా నోరు పారేసుకున్నారు.. ఏం చేశారు రా నా కొడకాల్లారా..సీఎం ఓ నత్తి నా కొడుకు..భర్తపోయిన ఆడవాళ్లను మోసం చేసిన దుర్మార్గపు నా కొడుకు..వీడు ఆరు నెలల్లో జైలుకు వెళ్తాడంటూ…చింతకాయల చిల్లర భాషలో చిందులేశాడు.దీంతో బెజవాడలో చింతకాయలను అరెస్ట్ చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయితే మళ్లీ తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం చింతకాయల హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు చింతకాయల అయ్యన్నపాత్రుడి చిల్లర భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… ముఖ్యమంత్రి వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అసభ్య పదజాలం ఉపయోగించటం ఏమిటంటూ చింతకాయలకు చివాట్లు పెట్టింది..
అయ్యన్న పదజాలం ముమ్మాటికి తీవ్ర అభ్యంతరకరమే, లాంటి మాటలను ఎంతమాత్రం అనుమతించేదిలేదని ఫైర్ అయింది.. అయ్యన్న వాడుతున్న బూతులు ఎంతవరకు ఆమోదయోగ్యమో చెప్పాలని హైకోర్టు ఆయన లాయర్‌నే ప్రశ్నించింది. దానికి లాయర్ ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. దాంతో అయ్యన్నకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడంలో తప్పేమీలేదని కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా ఇప్పటికే చింతకాయలను విచారించేందుకు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన విషయాన్ని పోలీసుశాఖ తరపు లాయర్ జడ్జికి గుర్తుచేశారు. కోర్టే స్వయంగా నోటీసులిచ్చి విచారించమని చెప్పింది కాబట్టి ఇక అయ్యన్నకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు.సో.. పోలీసులు చిల్లర నేత చింతకాయలకు చెరసాల్లో వేసి చిప్పకూడు తినిపించడం ఖాయంగా కనిపిస్తోంది..