తెలంగాణలో ఉన్న లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ‘రాష్ట్ర ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలి.
దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా? మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 116 చొప్పున నామినేషన్లు వేస్తాము.
ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న కామారెడ్డిలో 1016 నామినేషన్లు వేస్తాం’ అని ఆయన హెచ్చరించారు.