తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది.
దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది.
ఈ మేరకు సుప్రీం తీర్పును ఎన్ సీటీఈ వెబ్ సైట్ లో పెట్టింది. తాజా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీఎడ్ అభ్యర్థులు ఎస్ఏ పోస్టులకే పోటీపడాల్సి ఉంటుంది.