పచ్చమీడియా ఎంత జాకీలు వేసి లేపినా…నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు..దీంతో తనను తాను మాస్ లీడర్ గా ప్రజెంట్ చేసుకోవాలనే తాపత్రయంతో లోకేష్ మా అమ్మను అవమానించిన వారిని వదిలేదు లేదు.. వైసీపీ నేతలతో ఉచ్చపోయించి వారిని రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ..ఊరమాస్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు..టీడీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వైసీపీ నేతలను లేపేస్తాం…జగన్ ప్రభుత్వానికి సహకరించే పోలీసుల పేర్లను రెడ్ బుక్ లో ఎక్కించా…అధికారంలోకి రాగానే అంతు చూస్తాం అంటూ లోకేష్ కళ్లు పెద్దవి చేసి..రాని గొంతును పెగలదీసుకుని మరీ రెచ్చిపోతున్నాడు.
భీమవరంలో గనుపూడి సెంటర్‌లో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా నారా లోకేష్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, గజదొంగ అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో దోపిడీలకు పాల్పడుతున్నాడంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కనీసం డజను కేసులను పెట్టించుకోవాలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలంటూ లోకేష్ టీడీపీ క్యాడర్‌ను మరింత రెచ్చగొట్టాడు. చినబాబు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు మరింత పేట్రేగిపోయారు. వైసీపీ సానుభూతిపరులపై దాడులకు దిగారు. రోడ్డు పక్కన వైసీపీ జెండాలను పట్టుకుని నిల్చుని నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు, గ్రంధి శ్రీనివాస్ అనుచరులపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపైనా రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు.
తాజాగా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి. లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు.అంతకు ముందు పుంగనూరులో చంద్రబాబు కూడా స్థానిక వైసీపీ నేతలపై ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విధ్వంసం జరిగింది.
భీమవరంలో లోకేష్ వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నారాలోకేష్ నిరాకరించడం గమనార్హం. అయితే 118 కోట్ల ముడుపుల బాగోతంలో చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో చంద్రబాబు, లోకేష్ లు అడ్డంగా దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి..జాతీయ మీడియాలో సైతం చంద్రబాబు బ్లాక్ మనీ బాగోతంపై చర్చ జరుగుతోంది. దీంతో తండ్రీ కొడుకులు ఇలా రోడ్‌షోలు, పాదయాత్రల్లో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వైసీపీ నేతలపై దాడులు చేయిస్తూ అరాచకం సృష్టిస్తూ బ్లాక్ మనీ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.