Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!

చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!

దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తనపై కక్ష కట్టిందని మొసలికన్నీరు కార్చాడు.. ఒకటి రెండు రోజుల్లో తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, నాపై దాడులు కూడా చేస్తారని వాపోయాడు. ఎన్ని అరాచకాలు చేసినా తాను నిప్పులా బతికానంటూ బిల్డప్పులు ఇచ్చాడు.

అయితే చంద్రబాబు విమర్శలపై వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు..చంద్రబాబు నిప్పు కాదు..తప్పుడు పనులు చేసే తుప్పు అంటారు ఫైర్ అయ్యారు. . ‘రూ. 118 కోట్లు చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్‌సీపీ కాదని , ఐటీ శాఖ అని విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీకీ సమాధానం చెప్పాల్సింది పోయి తనను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్‌ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. . దోపిడీ చేసి, తాను నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని సజ్జల ధ్వజమెత్తారు.. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్టు కూడా చేయాల్సింది. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావటం లేదని అన్నారు.. ముడుపులన్నీ ఎటుఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో ఐటీ శాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందని అన్నారు.  తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు అని తీవ్రంగా దుయ్యబట్టారు. పాపం పండినప్పుడు చంద్రబాబును అరెస్టు చేయటం ఖాయమని సజ్జల అన్నారు.

ఐటీ ముడుపుల కేసులో దోషి అని తేలితే శిక్ష తప్పదు. బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చట్టానికి అతీతుడు అయినట్లు చంద్రబాబు మాట్లాడటం బరితెగింపు కాక మరేంటి? అని ప్రశ్నించారు. ఇక దొంగతనాన్ని సాధారణం అంశంగా చూస్తున్న పురంధేశ్వరి తీరు చూస్తుంటే మరిదిని రక్షించాలన్న ఆమె ఎత్తుగడ అర్థం అవుతుందని అన్నారు.. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్‌పై బురద జల్లడమే ఎల్లోమీడియా విధానమని అందుకే చంద్రబాబు ఐటీ నోటీసులపై నోరెత్తడం లేదని.. సజ్జల టీడీపీ అనుకుల మీడియాపై ధ్వజమెత్తారు.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించి సానుభూతి పొందాలనేది చంద్రబాబు కుట్ర అని, పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం అని సజ్జల మండిపడ్డారు. మొత్తంగా ఎన్ని అరాచకాలు చేసినా నేను నిప్పు…అంటూ చంద్రబాబుకు నువ్వు… నిప్పు కాదు తప్పుడు పనులు చేసే తప్పు అంటూ సజ్జల దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat