ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గొంటారు.
ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.