తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతును రాజును చేస్తానంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని నిండా ముంచారని విమర్శించారు.
రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఫసల్ బీమా యోజన’ను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధును 10 ఎకరాల్లోపు ఉన్నవారికి మాత్రమే అమలు చేయాలన్నారు.
కౌలు రైతులకూ రైతుబంధు ఇవ్వాలని.. బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో డిమాండ్ చేశారు.