ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని మరీ…తెలివిగా బయటపడే మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ , టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తాను నిప్పు అంటూ చెవులు తుప్పులు వదిలేలా పదేపదే చెబుతూ జనాలను చావగొడుతుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు తాను ఎన్ని అరాచకాలు చేపినా నిప్పులా బతికాను అంటూ డైలాగ్ వేసేసారు. మొన్న స్కిల్ డెవలప మెంట్ కేసు, ఇప్పుడు 188 కోట్ల ముడుపుల వ్యవహారంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది…
తాజాగా రేపో మాపో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికా అంటూ తన అవినీతి బాగోతాలను ఏమార్చి తనను తాను నిప్పుగా ప్రజెంట్ చేసుకునే పనిలో పడ్డారు. రేపో మాపో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని, తనపై దాడులు కూడా చేస్తారని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్డులో అవినీతిబాగోతాల్లో 18 స్టేలు తెచ్చుకుని తెలివిగా తప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గుంటూ… వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని వాపోవడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో వైఎస్‌ఆర్ తనపై 26 ఎంక్వేరీలు వేశారని.. ఎన్ని కేసులు వేసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు బిల్డప్పు ఇచ్చారు..
నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందన్నారు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్, రాజధాని, అమరావతి ల్యాండ్స్.. అవుటర్ రింగ్ రోడ్ అవినీతి.. ఇప్పడు ఇప్పుడు ఇన్‌కంట్యాక్స్ అంటున్నారని చంద్రబాబు వాపోయాడు. 45 సంవత్సరాలుగా తనపై ఎవ్వరూ కేసులు పెట్టలేదన్నారు. ఎక్కడా సాక్ష్యాధారాలు లేవన్నారు. తనపై దాడి చేసినా చేస్తారని, తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. వైసీపీ చేసిన తప్పులన్నింటినీ మనపై మోపి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, నాపై దాడులు కూడా చేస్తారని చంద్రబాబు పచ్చమీడియా సాక్షిగా పచ్చిగా ఎదురుదాడికి దిగారు.
అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు మాత్రమే ఇచ్చింది…118 కోట్లకు వివరణ ఇవ్వమని…సరైన ఆధారాలు ఇస్తే సరే..లేకుంటే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది….లేదా ఐటీశాఖ 118 కోట్ల ముడుపుల బాగోతంలో కోట్లాది రూపాయిలు చేతులు మారితే మాత్రం తీవ్రమైన నేరంగా భావించి…అరెస్ట్ వంటి చర్యలకు దిగుతుంది. అయితే చంద్రబాబుకు తెలుసు..ఆ డబ్బులు బోగస్ కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని మళ్లించి…ప్రతిగా వందలకోట్లు కమీషన్లుగా కొట్టేసామని…అందుకే అరెస్ట్ భయంతో వణికిపోతున్న బాబు..తనపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందంటూ…ప్రజల్లో సింపతీ కొట్టేయడానికి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను అరెస్ట్ చేస్తారు..తనపై దాడులు చేస్తారంటూ…కొత్త డ్రామా మొదలుపెట్టాడని క్లియర్ అర్థమవుతుంది..ఎన్ని అరాచకాలు చేసినా నేను నిప్పులా బతికా అంటూ డైలాగులు వేస్తున్నారు..అవును బాబుగారు ఇన్నేళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని తప్పుడు పనులు చేసినా తెలివిగా తప్పించుకున్న తమరు నిప్పు కాక మరేటి..అంతేగా..!