టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా తప్పించుకున్నాడు. కానీ ఇటీవల షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ పై జరిగిన ఐటీ దాడుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు రూ. కోట్లు కమీషన్లు ఇచ్చినట్లు షాపూర్ జీ కంపెనీకి చెందిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని వెల్లడించడంతో ఐటీ శాఖ అధికారులు 118 కోట్లను బ్లాక్ మనీగా గుర్తిస్తూ
వివరణ ఇవ్వాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.
అయితే సాంకేతిక కారణాలు సాకుగా చూపి గతంలో ఓటుకు నోటు కేసుతో సహా అనేక కేసుల నుంచి తెలివిగా బయటపడిన చంద్రబాబు అడ్డంగా బుకాయించాడు..దీంతో ఐటీ అధికారులు ఏకంగా 46 పేజీల సుదీర్ఘ నోటీసులు చంద్రబాబుకు జారీ చేశారు. అయితే ఈ నోటీసుల్లో రాజధాని పేరుతో తాత్కాలిక భవన నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు పిండుకోవడంతో చేతివాటం చూపిన చినబాబు నారా లోకేష్ పేరు కూడా బయటపడింది. లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ కు అక్రమ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. మీ కుమారుడు నారా లోకేష్ సన్నిహితులు అక్రమంగా నగదు తీసుకున్నారందుకు ఆధారాలివి..వీటిపై మీరేం సమాధానం చెబుతారంటూ..బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్ మెసేజ్ లను స్క్రీన్ షాట్ల రూపంలో అందించి మరీ నోటీసులను జారీ చేసింది.
విశాఖకు చెందిన ఆర్వీఆర్ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘురేలా ఆయన సన్నిహితుల ద్వారా చంద్రబాబుకు, లోకేష్ సన్నిహితులకు భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో వెల్లడించారు ఐటీ అధికారులు. 2020లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో జరిపిన ఐటీ సోదాల్లో ఆయన ఫోన్ లో ఈ చాటింగ్ లన్నీ సేకరించినట్లు, వాటిని శ్రీనివాస్ కూడా అంగీకరించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ కు రూ.4.5 కోట్లను ఎలా చేరవేశారో ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారని, 2019, మే 22న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ డబ్బుల పంపిణీ గురించి అడగ్గా లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ కు రూ. 4.5 కోట్లను పార్టీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని తెలిపాడు. అంకిత్ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో అయితే ఓకే అంటూ చంద్రబాబు పీఏ బదులిచ్చాడు.
వాంగ్మూలం సమయంలో ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ లను మనోజ్ వాసుదేవ్ కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది. అందుకేనేమో చంద్రబాబు ఐటీ శాఖలో తన తాబేదార్ల ద్వారా ఈ విషయం ముందే తెలుసుకుని కేంద్ర పెద్దల కాళ్ల మీద పడి…మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకుని…ఐటీ కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడన్న మాట…మొత్తంగా తండ్రీ కొడుకులు రాజధానిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో వందల కోట్లు కమీషన్ల రూపంలో నొక్కేసినట్లు ఐటీ శాఖ నోటీసుల్లో బయటపడింది. మరి ఈ ముడుపుల వ్యవహారంలో ఐటీ శాఖ మున్ముందు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.