తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో భారీ వర్షంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో నీటి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి…
నగరంలో ఉన్న అన్ని నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.