కరోనా విజృంభణ తర్వాత అత్యధికులు గుండెపోటుతో మృత్యువాత పడుతున్న సంగతి తెల్సిందే. అయితే కోవిడ్ కు గుండెపోటుకు ఏమైన సంబంధం ఉందా..?. లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాము..?. దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న కోవిషీల్డ్ ,కోవ్యాక్సిన్ టీకాలకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు.
భారత్ లో ఆ టీకాలు చాలా సురక్షితమని వివరించారు. తాము జరిపిన పరిశోధనల్లో భాగంగా జీబీ పంత్ ఆస్పత్రిలో 2021ఆగస్టు నుండి గతేడాది ఆగస్టు వరకు చికిత్స తీసుకున్న దాదాపు పదిహేను వందల డెబ్బై ఎనిమిది మందికి సంబంధించిన వైద్య సమాచారాన్ని అధ్యయనం చేశాము.
వీరిలో 1086మంది కోవిడ్ టీకాలు తీసుకున్నారు. వీరిలో గుండెపోటు వచ్చినవారు చాలా తక్కువమంది ఉన్నారు. టీకాల వల్ల ఉండే దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టీకాలు తీసుకున్నవారి కంటే తీసుకోని వారిలోనే ఎక్కువగా గుండెపోటు మరణాలు నమోదయ్యాయి అని చెప్పారు.