తెలంగాణ బీజేపీ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన వారిలో మొదటివాడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
అయితే తాజాగా తెలంగాణ ఉద్యమకారులకు,బహుజనులకు కీలక పదవులు ఇవ్వాలనే సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు అయినాక కూడా తన తీరు మార్చుకోకపోవడంతో ఆ పార్టీ అధినాయకత్వం యెన్నంపై వేటు వేసింది.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ,సస్పెన్షన్ వేటు తదితర అంశాలపై నేడు మంగళవారం మీడియాతో మాట్లాడనున్నారు.