తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
దాదాపు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారు.. ఇందులో 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా వెల్లడైంది. అటు ప్రభుత్వానికి గౌ50 కోట్ల మేర పెండింగ్ ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.