తెలంగాణలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న ఐదు వందల అరవై ఏడు మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు,అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బోజ్జా జోవో విడుదల చేశారు.
దాదాపు అరవై మూడు మంది పురుషులు ఐదు వందల నాలుగు మంది మహిళలు కలిపి మొత్తం ఐదు వందల అరవై ఏడు మంది సిబ్బంది క్రమబద్ధీకరిస్తూ ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి.
2007సర్వీస్ రూల్ ప్రకారం ఎంపికైన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. పదహారు సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిన కొనసాగుతున్న సిబ్బందిని క్రమబద్ధీకరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.