తన చేతికి మట్టి అంటకుండా..వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపించే తెలివితేటల ముందు కరడు గట్టిన స్మగ్లర్లు, మాఫియాడాన్ లు కూడా దిగదుడుపే అని….2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల అధిపతిగా మారి వ్యవస్థలనే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న అవినీతి చక్రవర్తి అని రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు అమరావతిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో కాంట్రాక్టులన్నీ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టిన చంద్రబాబు బోగస్ కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని ఆయా కంపెనీలకు మళ్లించి ప్రతిగా వేల కోట్లు కమీషన్లు చంద్రబాబు కొట్టేశారని ఐటీ శాఖ నోటీసుల్లో బట్టబయలైంది… 118 కోట్లు మాత్రమే ఐటీ నోటీసుల్లో అధికారికంగా పేర్కొన్నా… గతంలోనే చంద్రబాబు 2 వేల కోట్లు స్కామ్ లో నల్లధనాన్ని దేశం దాటించారని ఆరోపణలు వెల్లువెత్తాయి..కానీ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబు తెలివిగా సాంకేతిక కారణాల పేరుతో , చట్టాలలోని లొసుగులతో ఆ బాగోతం నుంచి తప్పించుకున్నారు.
అయితే ఇప్పుడు ఐటీ శాఖ మాత్రం కోట్ల బ్లాక్ మనీ బాగోతంలో ఏకంగా చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు జారీ చేసింది. అందులో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ , నారాలోకేష్ సన్నిహితులు కిలారు రాజేష్, రఘు రేలా, శ్రీకాంత్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని వంటి సన్నిహితుల ద్వారా కోట్లాది రూపాయలు కోడ్ భాషలో కొట్టేసిన విషయం ఐటీ శాఖ నోటీసుల్లో బట్టబయలైంది.
అచ్చం డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళ మాదిరి… అంతర్జాతీయ మాఫియా డాన్లు తరహా… అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే బ్రోకర్ల స్థాయిల్లో .. చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా కోడ్ భాష వాడి రూ.కోట్లు కొట్టేసింది. రూ. 8వేలకోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ-పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపుల రూపేణా చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు తీసుకున్నారు. ఆయితే ఈ వ్యవహారంలో తమ చేతికి మట్టి అంటకుండా.. ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు అంతా కోడ్ భాషను వినియోగించారు. డబ్బును ఏయే ప్రాంతాలకు ఎలా బదిలీ చేయాలన్న దానికి సంబంధించి పకడ్బందీగా ఉండేలా ఒక కోడ్ భాషను ఉపయోగించారు. హైదరాబాద్ లోని వారికీ డబ్బు వేయాలంటే HYD అని రాశారు. విజయవాడలోని తమ అనుయాయులకు పంపాలి అంటే విజయ్ అని, విశాఖలోని వారికి పంపాలి అంటే విష్ అని, బెంగళూరు వారికి ఐతే బాంగ్ అని వారిమధ్య వాట్సాప్ చాట్ సంభాషణ నడిచింది. దీంతోబాటు ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. స్టీల్ అని అన్నారు.. స్టీల్ అంటే డబ్బు అని.. చెబుతూ దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు. టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారు.
తమ విచారణలో ఈ కోడ్ భాషను డీకోడ్ చేసిన ఐటీ అధికారులు నివ్వెరపోయారు. కరడుగట్టిన స్మగ్లర్లు, డ్రగ్ మాఫియా ముఠాలు ఇలా కోడ్ భాషల్లో తమ మాల్ ను దేశాలు దాటిస్తారు..వీరిని మించి చంద్రబాబు గ్యాంగ్ వందలాది కోట్లను కోడ్ భాషలో తెలివిగా కొట్టేసిన వైనం ఐటీ అధికారులనే ఆశ్చర్యపర్చింది..దటీజ్ చంద్రబాబు…పచ్చ నోట్లను దేశం దాటించడంలో ఈ పచ్చ బాస్ కు మించిన వారు లేరు..ఇది నారావారి ఎల్లో మాఫియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు అండ్ గ్యాంగ్ కోడ్ భాషలో కోట్లు నొక్కేసిన మ్యాటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.