Home / SLIDER / తెలంగాణలో ఎన్నికలు అప్పుడే..జమిలిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్..!

తెలంగాణలో ఎన్నికలు అప్పుడే..జమిలిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్..!

కేంద్రంలోని మోదీ సర్కార్ మళ్లీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది..ఏకంగా లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీఎన్నికలు ఒకేసారి జరిగేలా జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరుతో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే మోదీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం, మరోవైపు ఆయారాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగడం..అలాగే కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవడం, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ కు సవాలు విసురుతుండడంతో బీజేపీకి కంగారు మొదలైంది..

త్వరలో జరగనున్న తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది..ఆయా రాష్ట్రాలలో ఓడిపోతే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయం..అందుకే జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతుంది…ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లుతో పాటు, ఇండియా కూటమి ప్రభావం చూపే అవకాశం ఉండడంతో దేశం పేరును ఇక ఇండియాకు బదులుగా భారత్ గా సంబోధించాలంటూ రాజ్యాంగ సవరణలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే జమిలి ఎన్నికలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా జమిలి ఎన్నికల పై మోడీ సర్కార్‌వి అన్ని డ్రామాలేనని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ అన్ని రాష్ట్రాల కలయిక అన్న ఆయన జమిలి ఎన్నికల సాధ్య సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ తో కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. భారత రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు ఎలాంటి రాజకీయ పరమైన అంశాల్లో ఉండకూడదని తీవ్రంగా ఆక్షేపించారు. ఇక కమిటీలో దక్షిణ భారతదేశం నుంచి ఎవరికీ చోటు కల్పించక పోవడం దేనికి సంకేతమని ఇది ఏకపక్షం అని మోదీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇప్పటికే నిర్ణయించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల పేరిట హడావుడి చేస్తుందని అన్నారు..

2018లోనే లా కమిషన్‌కు జమిలిపై బీఆర్ఎస్ ప్రభుత్వం అభిప్రాయాన్ని చెప్పింది.ఇప్పటికిప్పుడు మరోసారి నిర్ణయం చెప్పాలంటే కుదరదు…సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయం చెబుతారని వినోద్ కుమార్ తేల్చి చెప్పారు.. అసెంబ్లీ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోలేని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటరని అనుకోమని, అలాగే తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయని అనుకోను.. ఎందుకంటే జమిలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదని వినోద్ కుమార్ తెలిపారు. మొత్తంగా జమిలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయి.. ఈ ఏడాది డిసెంబర్ కు బదులుగా. వచ్చే ఏడాది ఒకేసారి ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్ సభ , అసెంబ్లీ కి జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ కొట్టిపారేసారు.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat