దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు రూ.805.68కోట్లుగా తెలిపాయి.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆస్తులు తగ్గినట్లు ప్రకటించిన ఏకైక పార్టీ బీఎస్పీ అని ఏడీఆర్ వెల్లడించింది. ఇక మొత్తం మీద ఎనిమిది జాతీయ పార్టీలు తమకు రూ.103.55కోట్లు అప్పులున్నట్లు .. కాంగ్రెస్ కు అత్యధికంగా రూ.71.58కోట్ల అప్పు ఉన్నట్లు ప్రకటించాయి.