తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ మహేశ్ విట్టా తన ప్రియురాలు శ్రావణిని పెళ్లి చేసుకున్నారు.ఏపీలో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లతోపాటు పలువురు నటులు హాజరయ్యారు.
యూట్యూబ్ వీడియోలతో పేరుపొందిన మహేశ్.. బిగ్బాస్-3లో దాదాపు 60 రోజులు ఉన్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కృష్ణార్జున యుద్ధం, శమంతకమణి, టాక్సీవాలా, ఛలో, కొండపొలం, అల్లుడు అదుర్స్ తదితర చిత్రాల్లో నటించారు.