ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పాత లబ్దిదారులతో పాటు ప్రతి ఏటా ఈ పథకం కింద కొత్త లబ్దిదారులకు కూడా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. తాజాగా వైఎస్ఆర్ చేయూత పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రేపే అంటే సెప్టెంబర్ 5, చివరి తేదీ. అర్హులైన వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా… కొత్త, పాత లబ్ధిదారుల ధ్రువీకరణకు ఈ నెల 11 వరకు గడువు ఉంది. వైఎస్ఆర్ చేయూత పథకం ఇప్పటి వరకు అందని మహిళలు..రేపటిలోగా దరఖాస్తు చేసుకుంటే బెటర్…ఈ నెల 11 వరకు మీ దరఖాస్తుల ధ్రువీకరణ జరుగుతుంది..ఆ తర్వాత నియమనిబంధనల ప్రకారం అర్హులైనవారందరి ఖాతాల్లో రూ. 18, 750 జమ అవుతాయి..సో..ఇంకెందుకు ఆలస్యం..వెంటనే అప్లై చేసేయండి..
