మూడు పదుల వయసులో కూడా యువతను మత్తెక్కిస్తోన్న హాట్ బ్యూటీ.. మిల్క్ సుందరి తమన్నా.. తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పద్దెనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో పలు విషయాల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన వివాహం గురించి ఓ కీలక అప్డేట్ ను తెలియజేసింది ఈ మిల్క్ బ్యూటీ.
ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ “తనకు పెళ్లి వ్యవస్థపై చాలా నమ్మకం ఉంది. అందులోనూ భారతీయ వివాహ వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం. కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ తర్వాత కేరీర్ లో బిజీ అవ్వడంతో ఆ నిర్ణయానికి కొద్దిగా బ్రేకిచ్చాను. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మస్త్ వస్తున్నాయి.
నా పెళ్లి ముచ్చట వినాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అని ఈ ముద్దుగుమ్మ తేగెసి చెప్పింది. అయితే ఈ మిల్క్ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు విజయ్‌వర్మతో గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రేమజంట మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లొచ్చారు కూడా..