కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ పూర్ వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ నుండి రాగానే ఆస్పత్రికి చేరుకుంటారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఏడాదిలో ఆమె ఇది మూడో సారి ఆసుపత్రిలో చేరడం .