ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్.. నటుడు గడ్డం నవీన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
తాజాగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నవీన్ తన జబర్దస్త్ మరియు సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ” తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏండ్లవుతున్నది. నాకు జబర్దస్త్ షో లైఫ్‌నిచ్చింది. దాంతో జబర్దస్త్ నవీన్ పేరుతో పిలుస్తుంటారు. ప్రస్తుతం సినిమాల్లో మంచి అవకాశాలొస్తున్నాయి.
‘గేమ్ ఛేంజర్’ ‘సైంధవ్’ చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. వీటితో పాటు పది సినిమాలను పూర్తిచేశాను. ప్రస్తుతం కమెడియన్‌గా నటిస్తున్నా. సెంటిమెంట్, విలన్ పాత్రలు కూడా చేయాలని ఉంది. నిర్మాత కావాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం భైరవకోన, మిస్టరీ, వృషభ, చూ మంతర్, భూతద్దం భాస్కర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నా’ అని చెప్పుకోచ్చారు.