తెలంగాణలో ఎన్నికల వార్ మొదలైపోయింది..ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఖరారు చేశారు. అయితే టికెట్ల జాబితా మాత్రమే ప్రకటించా..చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు మారకపోతే వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు గాంధీభవన్ లో టికెట్ల కోసం కౌంటర్లను తెరిచిన కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎస్సీ డిక్లరేషన్ అంటూ దళితులను ఆకట్టుకోవడానికి పలు ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారు. అయితే ఈ ఎస్సీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలేవి ఆచరణ సాధ్యంగా లేవని సగటు తెలంగాణ ప్రజలు అంటున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ డిక్లరేషన్లపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కొంత మంది డిక్లరేషన్ అంటూ నాటకాలకు తెరలేపుతున్నారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని మంత్రి హరీశ్ రావు తేల్చిచెప్పారు.
ఇవాళపాలకుర్తిలోని వల్మిడీ గ్రామంలో శ్రీ సీతారాములు విగ్రహం ప్రతిష్ట జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు.. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం, ఇతరులు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే అభివృద్ధి కొనసాగుతుంది. ఇతరులు గెలిస్తే అభివృద్ధికి కుంటు పడుతదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు వస్తున్న కరెంటు.. వేరే ప్రభుత్వం వస్తే కరెంట్ వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 75 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అలాగే రైతు రుణమాఫీ చేస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం బీఆర్ఎస్‌దేనని తేల్చి చెప్పారు. బీజేపీ జమిలి పేరుతో ఎన్నికల డ్రామాలు ఆడుతున్నది. బీజేపీ ఎన్ని జెమిలీలు తెచ్చినా జంబ్లింగ్‌లు చేసినా బీఆర్ఎస్ విజయం మాత్రం ఖాయమన్నారు.దక్షిణభారతంపై బీజేపీ చూస్తున్న చిన్న చూపుకు తగిన రీతిలో.. ఈ ప్రాంత ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో, దేశంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అధికారం ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి చేయకుండా, అధికారం లేని రాష్ట్రాల్లో ఎలా చేస్తారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మొత్తంగా మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచన రేకేత్తిస్తున్నారనే చెప్పాలి.