చేసేవన్నీ తప్పుడు పనులే అయినా..తాను నిప్పు అంటూ చెప్పుకునే నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబు నాయుడి అవినీతి తుప్పు బాగోతం బయటపడింది. టీడీపీ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు ప్రతిగా తన పీఏ శ్రీనివాస్ తో ఆయా బోగస్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించి కమీషన్లు కొట్టేసాడని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 వేల కోట్లు చంద్రబాబు అప్పనంగా సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకు తరలించినట్లు మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. కానీ మన స్టేబిన్ బాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అప్పుడు తప్పించాడు..ఇప్పుడు అదే షాపూర్ జీ పల్లోంజి గ్రూపులపై ఐటీ రైడ్ ల సందర్భంగా చంద్రబాబు రూ. 188 కోట్లు బ్లాక్ మనీ బోగస్ కంపెనీల ద్వారా నొక్కేసిన వైనం బయటపడింది. దీంతో చంద్రబాబు లెక్కలు చెప్పని ఆ 11 కోట్లను బ్లాక్ మనీగా గుర్తింస్తూ…ఆయనకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే చంద్రబాబు మాత్రం ఐటీ నోటీసులకు సమాధానం ఇవ్వకుడంా సీబీఐ, ఐటీలు, ఈడీలు నన్నేం చేయలేదు..నేను నిప్పు అంటూ ఐటీ శాఖ అధికారులపై, వైసీపీ నేతలపై ఎదురుదాడికి దిగాడు.
అయితే చంద్రబాబు 118 కోట్ల బ్లాక్ మనీ బాగోతంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. బాబుగారిని తనదైన స్టైల్లో తూటాల్లాంటి డైలాగులతో ఉతికారేసారు. ఎన్నికలలో డబ్బులు పంచడం నేర్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 1999 లోనే ఒక్కో అభ్యర్ధికి కోటి చొప్పున ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలలో వరసగా 5, 10, 20, 30 కోట్ల రూపాయలు చొప్పున అభ్యర్థులకు ఇచ్చారన్నారు. పదివేల కోట్ల రూపాయలు తన పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు ఇచ్చాడనేది వాస్తవమని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ డబ్బు అంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందంటే కమీషన్లు తీసుకోబట్టే కదా అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఐటీ నోటీసులు ఇచ్చిన 118 కోట్లు అనేది చాలా తక్కువ మొత్తమన్నారు. ఇది రికార్డుగా దొరికిన డబ్బు మాత్రమే అని.. లక్ష కోట్లు వరకు దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలు, పెరుగు అమ్మే వాళ్లు చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారు..కానీ హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికలలో వేల కోట్లు ఖర్చు పెట్టి అయినా గెలవాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో స్వార్థపరుడు, అవినీతిపరుడు, నమ్మక ద్రోహి, 420 గాడు చంద్రబాబు మాత్రమే అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయకపోతే సింగపూర్ లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని కొడాలి నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను 5 వేల కోట్లు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పారని, అవినీతి చేయకుండా అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే.. 2014లోనే తాము అధికారంలోకి వచ్చే వాళ్ళమన్నారు. చంద్రబాబు క్లీన్ చిట్ అని కేసులు లేవంటారా అని ప్రశ్నించారు. రెండు ఎకరాల వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. ఈ చట్టాలు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎలా దోచుకోవాలో…చట్టానికి దొరకకుండా మేనేజ్ చేయాలో.. చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసిన చంద్రబాబు బీజేపీని బూతులు తిట్టారని.. ఇప్పుడు వాటేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ 2014లో ఓడిపోయారని ఎవరినైనా కలిశారా.. ఒంటరిగా పోటీ చేయలేదా అని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏమైనా పేద కుటుంబమా… కాదు కదా అని అన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్ మేనేజ్ చేసి, బీజేపీ, మోడీ సంక నాకినా.. రాష్ట్ర ప్రజల నుంచి చంద్రబాబు తప్పించుకోలేరంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 118 కోట్ల బ్లాక్ మనీ బాగోతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న టైమ్ లో చంద్రబాబుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.