సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి.
రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిన్న ఆదివారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఒ పన్నీర్ సెల్వం రజనీతో భేటీ కావడం వెనక ఎలాంటి రాజకీయం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.