Home / SLIDER / మహిళా కాంగ్రెస్ నేతపై అత్యాచారం..టీ కాంగ్రెస్ సీనియర్ నేతకు నోటీసులు..!

మహిళా కాంగ్రెస్ నేతపై అత్యాచారం..టీ కాంగ్రెస్ సీనియర్ నేతకు నోటీసులు..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బెంగళూరు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి వెళ్లి..కాంగ్రెస్ పెద్దలను కలిపి…పనిలో పనిగా ఓ నాలుగురోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు..అయితే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల కార్యకలాపాలకు బెంగళూరు వేదికగా మారింది. అయితే కొందరు కామాంధులైన కాంగ్రెస్ నాయకులు…మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవులు ఆశ చూపి, లేదా ప్రేమ పేరుతో వంచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.గతంలో కొందరు మహిళా కాంగ్రెస్ నాయకులు , తమను కాంగ్రెస్ అగ్రనేతలు కొందరు లైంగికవేధింపులకు పాల్పడుతున్నట్లు గాంధీభవన్ లో క్రమశిక్షణా కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా దుబ్బాక ఎన్నికల సమయంలో ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై నారాయణపేట కాంగ్రెస్ మాజీ అధ‌్యక్షుడు శివకుమార్ రెడ్డికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని ఓ హోటల్‌కు తనను పిలిపించిన శివకుమార్‌రెడ్డి, మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించి, తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ మహిళా కాంగ్రెస్‌ నాయకురాలొకరు కబ్బన్‌పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు హాజరవ్వాలంటూ శివకుమార్‌రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. తనకు వారం రోజుల గడువు ఇవ్వాలని శివకుమార్‌రెడ్డి కోరినట్లు కబ్బన్‌పార్క్‌ పోలీసులు తెలిపారు. కాగా.. గత ఏడాది మే 7న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శివకుమార్‌రెడ్డిపై ఇవే అభియోగాలతో ఐపీసీలోని 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2020లో తనకు శివకుమార్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, దుబ్బాక ఎన్నికల సమయంలో తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డట్లు ఆమె వివరించారు. 2021 జూన్‌ 24న ఓ హోటల్‌లో తన మెడలో పసుపుతాడు కట్టి, అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలిపారు. ఆ తర్వాత బేగంపేట, బెంగళూరుల్లో హోటళ్లకు తీసుకెళ్లి, మత్తుమందు కలిపినకూల్‌డ్రింక్స్‌ ఇచ్చి, అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపించారు. అయితే.. సరైన ఆధారాల్లేక ఈ కేసును కొట్టివేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. దీంతో సదరు మహిళా కాంగ్రెస్ నాయకురాలు బెంగళూరులో కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెంగళూరు పోలీసులు శివకుమార్ రెడ్డికి విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేశారు. మరి ఈ కేసులో బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat