తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే నేపథ్యంలో మాజీ మంత్రి డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డిని అనర్హుడిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఎమ్మెల్యే దేశ అత్యున్నత స్థానమైన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.
గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించగా ఇదే తీర్పునిస్తే సదరు ఎమ్మెల్యే వనమా సుప్రీం కోర్టుకు వెళ్ళగా ఆ తీర్పుపై స్టే ఇచ్చింది.