తెలంగాణలో కమలం పార్టీ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది…హైకమాండ్ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు విస్తుపోతున్నారు..బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీకి మాంచి ఊపు వచ్చిన విషయం వాస్తవం..దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది..అయితే హుజూర్ నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ఓ దశలో బండి నాయకత్వంల బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కాషాయ క్యాడర్ ఆశించింది..బండి సారథ్యంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు కూడా బీజేపీలో చేరారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితులైన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలు చేరిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మెల్లగా పడిపోతూ వస్తోంది. తెలంగాణలో సీఎం సీటుకు కన్నేసిన ఈటల రాజేందర్ మెల్లగా బండి సంజయ్ సీటుకు పొగబెట్టాడు.. ఈటల, ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి వంటి నేతలు కూడా బండికి వ్యతిరేకంగా..హైకమాండ్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి బండిని అధ్యక్ష పీఠం నుంచి దించేశారు…దీనికి బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు కూడా కారణమయ్యాయి…
అయితే బండి సంజయ్ ని దించేసి కిషన్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పగించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింతగా దిగజారింది. కాషాయ క్యాడర్ లో పూర్తి నిస్తేజం నెలకొన్నాయి. వలస నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని…బీజేపీ సీనియర్లు మండిపడుతూ..హైకమాండ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీ లైన్ అతిక్రమించారంటూ బీజేపీ హైకమాండ్ వారిపై సస్పెన్షన్ వేటు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..గతేడాది గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ జాతీయ నాయకత్వం వేటు వేసింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు తొలగించాలని బండి సంజయ్ తో పాటు, విజయశాంతి వంటి నేతలు అధిష్టానాన్ని కోరుతున్నా…లాభం లేకపోయింది..ఇటు రాజాసింగ్ కూడా గోషామహల్ లో బీజేపీ నుంచే పోటీ చేస్తాననని..ఒక వేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు మానేది హిందూ ఏకత్వం కోసం పని చేస్తా అని తేల్చి చెప్పారు..అంతే కానీ సెక్యులర్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో చేరేది లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు.
తాజాగా ఉమ్మడి నిజామాబాద్ లో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తెలంగాణ బీజేపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది ” అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు ప్రేమేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్షణం నుండే పార్టీ నిర్ణయం అమలులోకి వస్తుంది అని ప్రేమేందర్ రెడ్డి స్పష్టంచేశారు.ఇదిలావుంటే, యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని గత కొన్ని నెలలుగా ఓ టాక్ నడుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని ఢీకొనాలంటే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అయితేనే కరెక్ట్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించారటం..కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల పేరుతో బీజేపీనే యెన్నంపై వేటు వేయడంతో ఆయన కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్ అయినట్లైంది. వరుస సస్పెన్షన్లతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక కాషాయ శ్రేణులు గందరగోళంలో పడ్డారు. ఈటల, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటినేతలు తమ వ్యక్తిగత అజెండాలతో పార్టీని దెబ్బతీస్తున్నారంటూ…కాషాయ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.